anjali: అంజలి మహా నాజూకుగా మారిపోయిందండోయ్!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు అమ్మాయే అయినా అంజలి ముందుగా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత తెలుగులోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి నుంచి కూడా అంజలి బొద్దుగానే ఉంటుంది. ఈ కారణంగా సీనియర్ హీరోల సరసనే ఆమెకి ఛాన్స్ లు వస్తున్నాయి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో వెంకటేశ్ సరసన .. 'డిక్టేటర్'లో బాలకృష్ణ జోడీగా అలరించింది.

 తాను లావుగా ఉన్నందువల్లనే యంగ్ హీరోల సరసన అవకాశాలు రావడం లేదని గ్రహించిందో ఏమో .. అంజలి స్లిమ్ గా మారడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అలా అంజలి మహా నాజూకుగా మారిపోయింది. ఇప్పుడు ఆమెను చూసిన వాళ్లు మన అంజలియేనా? అంటూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టవలసిందే. స్లిమ్ గా మారిన అంజలికి తెలుగు నుంచి అవకాశాలు పలకరిస్తాయేమో చూడాలి.    
Go Back to Shorts
anjali

More Telugu News