బాలయ్య కోసం ట్రై చేస్తోన్న హరీశ్ శంకర్?
Add ap7am to your home Screen

బాలయ్య కోసం ట్రై చేస్తోన్న హరీశ్ శంకర్?

'దువ్వాడ జగన్నాథం' సినిమా తరువాత ఒక మల్టీ స్టారర్ ను తెరకెక్కించాలని దర్శకుడు హరీశ్ శంకర్ అనుకున్నాడు. అయితే యంగ్ హీరోలంతా కూడా ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్ దృష్టి బాలకృష్ణ మీద పడినట్టు తెలుస్తోంది.

 ప్రస్తుతం బాలకృష్ణ .. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన పూరితోనే చేయనున్నారు. అయితే అందుకు కాస్త సమయం పడుతుంది. ఈ గ్యాప్ లో బాలకృష్ణతో ఒక సినిమా చేసేయాలనేది హరీశ్ శంకర్ ఆలోచన. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కోసం ఒక కథను సిద్ధం చేసుకోవడానికి హరీశ్ శంకర్ రెడీ అవుతున్నాడట. పూరి ద్వారా వెళ్లి బాలకృష్ణకి కథ వినిపించవచ్చనే ఆలోచనలో వున్నాడని అంటున్నారు. పూరి తన తనయుడితో సినిమాను పూర్తి చేసి బాలకృష్ణ తో సెట్స్ పైకి వెళ్లే లోగా, బాలకృష్ణతో సినిమా చేసేయాలనే హరీశ్ శంకర్ ప్లాన్ ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి మరి. 
balakrishna

More Telugu News