ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలకృష్ణ దృష్టిలో వర్మ లేనట్టే!
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలకృష్ణ దృష్టిలో వర్మ లేనట్టే!

ఎన్టీఆర్ బయోపిక్ ను తాను తెరకెక్కించనున్నట్టు ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. ఒక థీమ్ సాంగ్ ను కూడా ఆయన రికార్డు చేయించాడు. ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన ఎక్కడా ప్రస్తావించడం లేదు. దాంతో ఆయన ఈ సినిమా చేస్తున్నాడా .. లేదా అనే సందిగ్ధంలో ప్రేక్షకులు వున్నారు.

తాజాగా బాలకృష్ణ ఓ సందర్భంలో మాట్లాడుతూ .. ఈ సినిమాకి దర్శకుడిగా ఇంకా ఎవరినీ అనుకోలేదని చెప్పారు. ఎన్టీఆర్ తో ఎంతో అనుబంధం వున్న వారిని తానే స్వయంగా సంప్రదిస్తున్నాననీ, దానిని బట్టి స్క్రిప్ట్ వర్క్ ముందుకు వెళుతుందని అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ని ఎక్కడ ఆరంభించాలో .. ఎక్కడ ముగించాలో అనే విషయంపై తనకి పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు. దీనిపై ఎవరూ ఎలాంటి ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.       
balakrishna

More Telugu News