sai dharam tej: సాయిధరమ్ తేజ్ డీలాపడిపోయాడా?
బీవీఎస్ రవి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ 'జవాన్' అనే సినిమా చేశాడు. వరుస పరాజయాలతో వున్న తేజు ఈ సినిమా సక్సెస్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు రావడం కలిసొస్తుందని భావించాడు. అయితే ఈ సినిమా దసరాకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన డీలాపడిపోయాడని చెప్పుకుంటున్నారు.
'జవాన్' సినిమాకి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 'జవాన్' సినిమా చూసిన ఆయన కొన్ని సన్నివేశాల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారట. కొన్ని మార్పులు చేర్పులు చేయవలసి ఉందంటూ, దసరా బరి నుంచి 'జవాన్' ను తప్పించేశారట. ఆయన చెప్పిన మార్పులు చేసి అక్టోబర్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని దర్శకుడు భావిస్తే, అప్పుడు రిలీజ్ కి తగిన సమయం కాదంటూ .. నవంబర్ కి వెళదామని అన్నారట. ఇది తేజుకి మరింత నిరుత్సాహాన్ని కలిగించిందని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.