gunasekhar: హిరణ్యకశిపుడి పాత్రలో వెంకీ కాదట .. రానానే!

షార్ట్స్‌లో చూడండి
'రుద్రమదేవి' వంటి చారిత్రక చిత్రాన్ని జనరంజకంగా తెరకెక్కించిన గుణశేఖర్, ఈ సారి పౌరాణిక చిత్రానికి శ్రీకారం చుట్టారు. హిరణ్యకశిపుడు - భక్త్ర ప్రహ్లాదుడుకి సంబంధించిన కథాంశాన్ని ఆయన ఎంచుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా వెంకటేశ్ నటించే అవకాశం వున్నట్టుగా రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఆ పాత్రలో నటించబోతున్నది రానా అనేది తాజా సమాచారం.

హిరణ్యకశిపుడిగా రానా అయితేనే సరిగ్గా సరిపోతాడని గుణశేఖర్ భావించి రానాను సంప్రదించాడట. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ వస్తోన్న రానా, ఎంతమాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. పౌరాణికాలు తెరకెక్కించడంలో 'బాలల రామాయణం'తోనే గుణశేఖర్ తన సత్తాను చాటుకున్నారు. కనుక ఈ సినిమాను ఆయన అద్భుతంగా ఆవిష్కరిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.   
Go Back to Shorts
gunasekhar
rana

More Telugu News