ధనుష్ మూవీ గురించి ఐశ్వర్య మౌనం ఎందుకో?
Add ap7am to your home Screen

ధనుష్ మూవీ గురించి ఐశ్వర్య మౌనం ఎందుకో?

రజనీకాంత్ కూతురు సౌందర్య మెగా ఫోన్ చేతబట్టి ధనుష్ కథానాయకుడిగా 'విఐపి 2' సినిమాను తెరకెక్కించింది. నిర్మాణ సమయంలో ఉండగా ఈ సినిమా గురించి ధనుష్ భార్య, సౌందర్య సోదరి ఐశ్వర్య తెగ మాట్లాడేసింది. అయితే, ఈనెల 11వ తేదీన ఈ సినిమా తమిళనాట విడుదలై .. యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి ఐశ్వర్య ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా గురించి ఆమె ట్విట్టర్ లో కూడా ప్రస్తావించకపోవడం అయోమయానికి గురిచేస్తోంది. ఈ సినిమా ఆమెకి నచ్చలేదా? లేదంటే ఆమె సైలైంట్ అయిపోవడం వెనుక మరేదైనా కారణముందా? అనేది నెటిజన్ల మధ్య చర్చకు తెరతీసింది. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన తెలుగులో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.   
aishwarya
soundarya

More Telugu News