'పైసా వసూల్' పై ఫిల్మ్ నగర్ టాక్!
Add ap7am to your home Screen

'పైసా వసూల్' పై ఫిల్మ్ నగర్ టాక్!

దర్శకుడిగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడమెలాగో పూరీ జగన్నాథ్ కి బాగా తెలుసు. ఇక హీరోగా మాస్ ఆడియన్స్ ను మెప్పించడంలో బాలకృష్ణ సిద్ధహస్తుడు. ఈ నేపథ్యంలోనే 'పైసా వసూల్' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులకి ఇందులో మాస్ ఆడియన్స్  కోరుకునే కంటెంటే ఎక్కువగా ఉందనే విషయం అర్థమైపోయింది.

 దాంతో యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను  ఈ సినిమా ఎంతవరకూ థియేటర్స్ కి రప్పించగలదనేది ఆసక్తికరంగా మారింది. ఈ రోజుల్లో అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఉంటేనే వసూళ్ల విషయంలో దూసుకెళ్లడం జరుగుతోంది. ఏదో ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే రాబడి తగ్గుతోంది. ఇప్పటికే 'శాతకర్ణి' సినిమాతో బాలకృష్ణ 50 కోట్ల క్లబ్ లోకి చేరాడు. మరి ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఆయనని నిలబడుతుందా? అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.   
balakrishna
shriya

More Telugu News