శ్రియ అందుకే అంతగా టెన్షన్ పడిందా?
Add ap7am to your home Screen

శ్రియ అందుకే అంతగా టెన్షన్ పడిందా?

పూరీ జగన్నాథ్ - బాలకృష్ణ 'పైసా వసూల్' సినిమా చేయాలనుకున్నప్పుడు హీరోయిన్ గా శ్రియను అనుకున్నారట. అయితే ఈ సినిమా చేయడానికి శ్రియ అంతగా ఆసక్తిని చూపించలేదు. దాంతో తాను జోక్యం చేసుకున్నట్టుగా బాలకృష్ణ చెప్పారు. గతంలో తమ కాంబినేషన్లో 'చెన్నకేశవ రెడ్డి' .. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాలు చేశామనీ, అవి ఘన విజయాలను సాధించాయని అన్నారు.

 అందువలన 'పైసా వసూల్' చేస్తే హాట్రిక్ హిట్ దక్కుతుందో .. లేదోననే టెన్షన్ కి శ్రియ లోనైందని చెప్పారు. టెన్షన్ అవసరం లేదు .. హిట్ ఖాయమంటూ తానే ఆమెను ఒప్పించానని బాలకృష్ణ అన్నారు. అయితే .. పూరీ వరుస ప్లాప్ లు ఇస్తుండటం వల్లనే శ్రియ అంతగా టెన్షన్ పడిందేమోననే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ కొట్టి .. ఆ కామెంట్లను తుడిచేస్తుందేమో చూడాలి.  
balakrishna
shriya

More Telugu News