ఇంకా హీరోగానే చేయాలంటే కష్టమే : యాక్షన్ కింగ్ అర్జున్
ఇంతవరకూ తాను 150కి పైగా సినిమాలు చేశాననీ .. ఇంకా హీరోగానే కొనసాగాలంటే కష్టమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారనీ, అందుకు తగిన విధంగా కనిపించడానికి ప్రయత్నించవలసిందేనని అన్నారు. అలా డిఫరెంట్ గా ట్రై చేద్దామనే ఉద్దేశంతోనే ఈ పాత్రను ఒప్పుకున్నానని చెప్పారు. ప్రీక్షకులు ఆదరిస్తోన్న తీరు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని అన్నారు. ఇకపై ఇలా వైవిధ్యభరితమైన పాత్రలను చేయడానికి తాను సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చారు.