మహేశ్ బాబు న్యూ మూవీలో కీర్తి సురేశ్ కి ఛాన్స్ ?
Add ap7am to your home Screen

మహేశ్ బాబు న్యూ మూవీలో కీర్తి సురేశ్ కి ఛాన్స్ ?

మహేశ్ బాబు 25వ సినిమాను .. కొంతసేపటి క్రితం హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో లాంచ్ చేశారు. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అశ్వనీదత్ - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయిక విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ కీర్తి సురేశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

 ఈ సినిమా కోసం ముందుగా బాలీవుడ్ నుంచే హీరోయిన్ ను తీసుకుందామని అనుకున్నారట. కానీ ఆ తరువాత ఆ ఆలోచనను విరమించుకున్నారని వినికిడి. ఈ మధ్య కాలంలో తమిళంలో పాప్యులర్ అయిన హీరోయిన్ ను తీసుకుందామని అనుకుంటున్నారట. తమిళంలో కీర్తి సురేశ్ దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు తెలుగులో రెండు సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న ఆమె, ప్రస్తుతం 'మహానటి' తో పాటు పవన్ మూవీ చేస్తోంది. కనుక మహేశ్ 25వ సినిమాలో కథానాయికగా ఛాన్స్ కీర్తి సురేశ్ కి దక్కవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.    
mahesh babu
keerthi suresh

More Telugu News