gunasekhar: గుణశేఖర్ 'భక్త ప్రహ్లాద' గురించి ఫిల్మ్ నగర్ టాక్!

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ దర్శకులలో గుణశేఖర్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. చారిత్రక .. పౌరాణిక చిత్రాలను తాను అద్భుతంగా తెరకెక్కించగలనని ఆల్రెడీ ఆయన నిరూపించుకున్నారు. అలాంటి గుణశేఖర్ త్వరలో 'భక్త ప్రహ్లాద' జీవిత చరిత్రను తెరకెక్కించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గుణశేఖర్ ఈ నిర్ణయం తీసుకోవడం సాహసమే అవుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. పౌరాణిక చిత్రం కనుక .. భారీ సెట్స్ .. కాస్ట్యూమ్స్ .. గ్రాఫిక్స్ అవసరమవుతాయి. పౌరాణిక చిత్రంగా ఆ మధ్య వచ్చిన 'శ్రీరామరాజ్యం' .. ఈ మధ్య ప్రేక్షకులను పలకరించిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాలకి లభించిన ఆదరణ అంతంత మాత్రమే. సొంత నిర్మాణంలో అంటున్నారు కనుక, ఈ విషయంలో గుణశేఖర్ మరోసారి ఆలోచన చేయడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
Go Back to Shorts
gunasekhar

More Telugu News