పెళ్లికూతురవుతోన్న ప్రియమణి!
Add ap7am to your home Screen

పెళ్లికూతురవుతోన్న ప్రియమణి!

తెలుగు తెరపై అందాల కథానాయికగా మెరిసినవారిలో ప్రియమణి ఒకరు. తమిళ .. మలయాళ .. కన్నడ భాషా చిత్రాల్లోను ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ప్రియమణికి తెలుగులో అవకాశాలు తగ్గినా .. మిగతా భాషల్లో కెరియర్ ను నెట్టుకొస్తూనే వుంది. కొంతకాలంగా ముస్తఫా రాజ్ తో ఆమె ప్రేమ వ్యవహారం గురించిన వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తూనే వున్నాయి.

ఆయన్నే తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఆమె చెప్పేసింది కూడా. ఈ నెలలోనే ఈ ఇద్దరూ భార్యాభర్తలు కాబోతున్నారు. ఈ నెల 23వ తేదీన ఈ ఇద్దరూ రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోనున్నారు. 24వ తేదీన ఇండస్ట్రీ ప్రముఖులను .. తన తోటి నటీనటులను విందుకు ఆహ్వానిస్తుందట. కొంతమంది కథానాయికలు ఎంతో ఆడంబరంగా వివాహం చేసుకుంటూ ఉంటే .. ప్రియమణి ఇలా రిజిస్టర్ ఆఫీసులో పెళ్లికి సిద్ధపడటం ఆశ్చర్యమే. 
priyamani

More Telugu News