మహేశ్ .. చరణ్ లకు బాలకృష్ణతో పోటీ తప్పనట్టే!
Add ap7am to your home Screen

మహేశ్ .. చరణ్ లకు బాలకృష్ణతో పోటీ తప్పనట్టే!

ప్రస్తుతం మహేశ్ బాబు .. కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు చెప్పారు. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేస్తున్న 'రంగస్థలం 1985' సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఇక కె.ఎస్.రవికుమార్ తో బాలకృష్ణ సినిమా కూడా సంక్రాంతికే రానున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఈ సినిమా ఇంకా మొదలు కాలేదు కనుక కష్టమే అనుకున్నారు. కానీ అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది. ఇక షూటింగ్ అప్పటివరకూ పూర్తవుతుందా? అనే సందేహం కూడా కొందరిలో వ్యక్తమైంది. ఆ సందేహాన్ని కూడా పటా పంచలు చేసేస్తూ .. నాలుగు నెలల పాటు నిర్విరామంగా ఈ సినిమా షూటింగ్ జరగనుందని చెబుతున్నారు . డిసెంబర్ నాటికి సినిమాను పూర్తి చేసి జనవరిలో విడుదల చేయడం ఖాయమని అంటున్నారు. కనుక మహేశ్ .. చరణ్ లకు .. బాలకృష్ణతో పోటీ తప్పదనే చెప్పాలి.
balakrishna

More Telugu News