బాలకృష్ణ మూవీలో నయనతార కాకుండా మరో ఇద్దరు కథానాయికలు?
Add ap7am to your home Screen

బాలకృష్ణ మూవీలో నయనతార కాకుండా మరో ఇద్దరు కథానాయికలు?

పూరీ జగన్నాథ్ సినిమా 'పైసా వసూల్'కి ఇలా గుమ్మడికాయ కొట్టారో లేదో, అలా కె.ఎస్.రవికుమార్ తో కలిసి ఆ మరునాడే బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లారు. నిన్నటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బాలకృష్ణ నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలకి .. కొంత ఎమోషన్ ను కూడా జోడించి ఈ కథను తెరకెక్కిస్తున్నారు.

 ఈ సినిమాలో ఒక కథానాయికగా నయనతారను ఎంపిక చేశారు. ఆమె కాకుండా మరో ఇద్దరు కథానాయికలకు ఈ కథలో చోటు ఉందట. అందువలన మరో ఇద్దరు కథానాయికల కోసం కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆ ఇద్దరినీ ఖరారు చేయనున్నారని అంటున్నారు. ఆ ఛాన్స్ ఎవరికి దక్కనుందో చూడాలి.  
balakrishna

More Telugu News