'జవాన్' కోసం నాన్ స్టాప్ గా డాన్స్ చేసిన సాయిధరమ్ తేజ్!
'జవాన్' సినిమాలో ఒక పాట కోసం సాయిధరమ్ తేజ్ ఒక నిమిషం పాటు ఆగకుండా డాన్స్ చేసి అక్కడున్న వాళ్లందరినీ ఆశ్చర్యపరిచాడట. సింగిల్ టేక్ లో ఆయన ఈ డాన్స్ చేయడం విశేషం. తమన్ కంపోజ్ చేసిన ఆ పాటలో ఒక నిమిషం పాటు నాన్ స్టాప్ గా ఆయన వేసిన స్టెప్పులు, ఫ్యాన్స్ తో విజిల్స్ వేయిస్తాయని అంటున్నారు. బీవీఎస్ రవి దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో, మెహ్రీన్ కౌర్ కథానాయిక అనే సంగతి తెలిసిందే.