'పైసా వసూల్' టీజర్ ను సిద్ధం చేస్తున్నారు!
Add ap7am to your home Screen

'పైసా వసూల్' టీజర్ ను సిద్ధం చేస్తున్నారు!

'పైసా వసూల్' సినిమా ఫస్టు లుక్ వచ్చిన దగ్గర నుంచి బాలకృష్ణ అభిమానులు టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో సాధ్యమైనంత త్వరగా టీజర్ ను ఫ్యాన్స్ ముందుకు తీసుకురావడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది. ఈ నెల 28వ తేదీన ఉదయం 10:10 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 సినిమాలోని భారీతనం .. మాస్ అంశాలు టీజర్ ద్వారా ఆవిష్కరించి, మరింతగా అంచనాలు పెంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇంతవరకూ బాలకృష్ణ సినిమాల్లో 40 కోట్ల బడ్జెట్ హయ్యెస్ట్ గా నిలిచింది. ఈ సినిమాకి మాత్రం ఇంతవరకూ 47 కోట్లు ఖర్చు చేశారట. మరో మూడు కోట్లవరకూ ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలా బాలకృష్ణ  కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్నదిగా ఈ సినిమా క్రేజ్ ను సంపాదించుకుంది.     
balakrishna
shriya

More Telugu News