కర్ణుడి పాత్రకి హృతిక్ రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా?
Add ap7am to your home Screen

కర్ణుడి పాత్రకి హృతిక్ రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా?

'మహాభారతం'ను భీముడి కోణంలో తెరకెక్కించడానికి మలయాళ చిత్రపరిశ్రమలో సన్నాహాలు జరుగుతున్నాయి. భీముడి పాత్ర కోసం మోహన్ లాల్ ను ఎంపిక చేసుకున్నారు. శ్రీకుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను బీఆర్ శెట్టి నిర్మించనున్నాడు. ఈ సినిమాను వివిధ భాషల్లో తెరకెక్కిస్తారు. అందువలన పలు భాషలకి చెందిన నటీనటులను తీసుకోనున్నారు.

 అందులో భాగంగా తెలుగు నుంచి నాగార్జునను ఒక ముఖ్యమైన పాత్ర కోసం అడిగారట. అయితే నాగార్జున తన నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టారని అంటున్నారు. ఇక కర్ణుడి పాత్ర కోసం హృతిక్ రోషన్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఈ సినిమా యూనిట్ కూడా అంగీకరించింది. మరి ఈ పాత్రను చేయడానికి హృతిక్ రోషన్ ఓకే చెబుతాడా .. లేదా అనేది ఆసక్తికరంగా మారింది.   
hrithik roshan

More Telugu News