upendra: 'ఉయ్యాలవాడ'లోకి ఉపేంద్ర రానున్నాడా?

షార్ట్స్‌లో చూడండి
మెగా అభిమానులంతా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' సినిమా విశేషాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాకి అవసరమైన లుక్ పై చిరూ దృష్టి పెట్టారు. కథ .. కథనాలు .. నటీనటుల ఎంపిక పనుల్లో దర్శకుడు సురేందర్ రెడ్డి బిజీగా వున్నాడు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో రూపొందే ఈ సినిమాలో, కథానాయికలుగా ఐశ్వర్య రాయ్ .. నయనతారల పేర్లు వినిపిస్తున్నాయి.

 ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను తీసుకోనున్నారనేది తాజా సమాచారం. ఆల్రెడీ ఆయనని సంప్రదించడం .. పాత్ర గురించి వివరించడం జరిగిపోయిందని అంటున్నారు. ఇక ఆయన ఓకే చెప్పడం ఒకటే మిగిలుందట. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఉపేంద్ర మంచి పవర్ ఫుల్ రోల్ చేసి మెప్పించాడు. ఇక ఈ సినిమాలో ఆయన రోల్ ఎలా ఉంటుందో చూడాలి.    
Go Back to Shorts
upendra

More Telugu News