ఈ పూలతో ఈ గ్రహాలను పూజించాలి

ఈ పూలతో ఈ గ్రహాలను పూజించాలి
ఇంట్లోని పూజా మందిరంలో పూజ చేసుకున్నా .. ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నా మనసులోని కోరికలను చెప్పుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. తమ కోరికలు నెరవేరేలా చూడమని దైవాన్ని ప్రార్ధిస్తూ వుంటారు. దేవతలు ప్రీతి చెందేలా చేయడం కోసం వాళ్లకి ఇష్టమైన పూలతో పూజించడం జరుగుతూ ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా అనుకూల ఫలితాలను ఇవ్వడం కోసం, వాటికి ఇష్టమైన పూలతో పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

 సూర్య గ్రహాన్ని జిల్లేడు పూలతోను .. చంద్ర గ్రహాన్ని తెల్లని పూలతోను .. మంగళ గ్రహాన్ని పారిజాత పూలతోను పూజించాలి. అలాగే గురు గ్రహానికి పచ్చ గన్నేరు పూలతోను .. శుక్ర గ్రహానికి తెల్లని పూలతోను .. శని గ్రహానికి నీలం శంఖం పూలతోను పూజ చేయాలి. ఈ విధంగా చేయడం వలన ఆయా గ్రహాలు శాంతించి అనుకూల ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.       
Get the ap7am app Free · Opens in one tap Install

More Bhakti Articles