హనుమంతుడికి తైలం సమర్పిస్తే మంచిది

హనుమంతుడికి తైలం సమర్పిస్తే మంచిది
భక్తులను అనుగ్రహించడంలో హనుమంతుడు ఎంత మాత్రం ఆలస్యం చేయడు. ఆకుపూజ .. సిందూరాభిషేకం ఆయనకి ఎంతో ఇష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఆ విధంగా ఆయన ప్రీతి చెందేలా చేయడానికి భక్తులు శ్రద్ధ చూపుతుంటారు. ఇక హనుమంతుడికి శనివారం రోజున తైలం సమర్పించడం వలన శనిదేవుడు శాంతిస్తాడని కూడా ఆధ్యాత్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి.

శని దోషం వలన ఎంతటి వారైనా నానా రకాల బాధలను అనుభవించవలసి వస్తూ ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు .. కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైన .. ఆర్థిక పరమైన సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో శనిదేవుడు ప్రీతి చెందేలా చేయడం వలన ఆయనకి శాంతి కలుగుతుంది. ఫలితంగా శని దోష ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అలా శని దేవుడికి ప్రీతి కలిగించే పనుల్లో ఒకటిగా .. శనివారం రోజున హనుమంతుడికి తైల సమర్పణ చెప్పబడుతోంది. అందువలన శని దోష ప్రభావం వలన ఇబ్బందులు పడుతోన్నవారు, శనివారం రోజున హనుమంతుడికి తైల సమర్పణ చేయడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది.     
Get the ap7am app Free · Opens in one tap Install

More Bhakti Articles