నారాయణ నామ స్మరణ ఫలితం

నారాయణ నామ స్మరణ ఫలితం
'ఓం నమో నారాయణాయ' అనే నామాన్ని ఎప్పుడు .. ఏ వేళలో స్మరించినా విశేషమైన పుణ్య ఫలాలే కలుగుతాయి. శ్రీమన్నారాయణుడు లోక కల్యాణ కారకుడు .. తలచుకున్నంత మాత్రాన్నే కష్టాల కడలిలో నుంచి తీరానికి చేర్చే నాయకుడు. అలాంటి స్వామిని పూజించుటయే పుణ్యం .. దర్శించుటయే ధన్యం. 'ఓం నమో నారాయణనాయ' అనే నామం అత్యంత శక్తిమంతమైనది. సమస్త భయాలను ..దోషాలను .. ఆపదలను తొలగించి, సకల శుభాలను కలిగిస్తుంది.

అలాంటి నామాన్ని 'ధనుర్మాసం'లో స్మరించడం వలన మరింత విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ మాసంలో .. అనునిత్యం 'ఓం నమో నారాయణాయ' నామాన్ని స్మరిస్తూ ఉండాలి. దైనందిన వ్యవహారాలు చక్క బెడుతూనే, ఈ నామాన్ని మనసులో చెప్పుకుంటూ ఉండాలి. ఇలా మనసులో స్వామి రూపాన్ని ప్రతిష్ఠించుకుని, ఈ నామాన్ని స్మరిస్తూ ఉండటం వలన అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
Get the ap7am app Free · Opens in one tap Install

More Bhakti Articles