మంగళచండీ అమ్మవారిని పూజిస్తే చాలు
ఒక్కో గ్రహ సంబంధమైన దోషం కొన్ని రకాల ఇబ్బందులను .. బాధలను కలిగిస్తూ ఉంటుంది. వాటి బారి నుంచి బయటపడటానికి కొన్ని మార్గాలు చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా 'కుజ దోషం' అనగానే చాలామంది కంగారు పడిపోతుంటారు. అలాంటి కుజ దోషం నుంచి బయట పడటానికి 'మంగళ చండీ' ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతోంది.
కుజ దోషం వలన బంధువులతో మనస్పర్థలు .. వైవాహిక జీవితంలో కలతలు వస్తాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఎదో ఒక కారణంగా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. అంతే కాకుండా అనూహ్యమైన నష్టాలు ఎదురవుతుంటాయి. ఇక అనారోగ్య సమస్యలు వరుసబెడుతుంటాయి. దాంతో జీవితం నిరాశకి నిలయంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 'మంగళ చండీ' అమ్మవారిని మంగళవారం రోజున పూజిస్తూ ఉండటం వలన .. ఆ తల్లి పారాయణం చేయడం వలన విశేషమైన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.