పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆరాధన

పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆరాధన
ప్రతి మాసంలోను పౌర్ణమి విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. పౌర్ణమి రోజున చేయబడే పూజలు .. వ్రతాలు విశిష్టమైన ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే ఆశ్వయుజ పౌర్ణమి రోజున చేయబడే లక్ష్మీదేవి ఆరాధన కూడా అనంతమైన ఫలితాలు ఇస్తుందని చెప్పబడుతోంది.

ఈ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు ఆరాధన విశేషమైన పుణ్య ఫలితాలను ఇస్తే, పౌర్ణమి రోజున చేసే లక్ష్మీ పూజ సిరిసంపదలను ప్రసాదిస్తుందని చెప్పబడుతోంది. ఆశ్వయుజ పౌర్ణమిని 'కౌముది' పౌర్ణమి అని అంటారు. ఈ రోజున లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేయడం వలన, ఆశించిన ఫలితాలు వెంటనే అందుతాయని చెబుతారు.

ఈ పౌర్ణమి రాత్రి వేళలో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ, తన వ్రతాన్ని ఆచరించిన భక్తులను అనుగ్రహిస్తూ వెళుతుందట. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్ర్య బాధలు తొలగిపోయి, సిరి సంపదలు చేకూరతాయి. అందువలన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ పౌర్ణమి రోజున ఆ తల్లిని పూజిస్తూ .. సేవిస్తూ ఉండాలి.
పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆరాధన

More Bhakti Articles

Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install