ఘనవిజయాలను అందించే గణపతి

ఘనవిజయాలను అందించే గణపతి

ఘనవిజయాలను అందించే గణపతి
జీవితంలో ఎవరికైనా ఉత్సాహాన్నిచ్చేది .. ఆనందాన్నిచ్చేది విజయమే. తలపెట్టిన కార్యం సఫలీకృతమైతే చాలు, అప్పుడు కలిగే సంతోషమే వేరు. అలా ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకోవాలంటే వినాయకుడి అనుగ్రహం కావలసి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి అనుగ్రహాన్ని అందించే వినాయకుడి క్షేత్రాల్లో ఒకటి ఆసిఫాబాద్ లో కనిపిస్తుంది.

ఆదిలాబాద్ జిల్లా పరిధిలో గల ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్యను చూస్తే, స్వామి ఎంత మహిమాన్వితుడనే విషయం అర్థమవుతుంది. సాధారణంగా వినాయకుడిని వినాయక చవితి రోజునే గరికతో పూజించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అనునిత్యం గరికతో వినాయకుడిని పూజించడం కనిపిస్తూ ఉంటుంది. గరికతో పూజిస్తే చాలు, ఆ స్వామి అనుగ్రహం వెంటనే లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

తమకి చాలా ముఖ్యమనుకున్న పని అర్థాంతరంగా ఆగిపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్లు .. అనారోగ్యాల బారిన పడినవాళ్లు .. ఆర్ధికపరమైన సమస్యల వలన అవస్థలు పడుతున్న వాళ్లు .. విద్య విషయంలో వెనుకబడినవాళ్లు ఇక్కడి గణపతికి గరికతో పూజ చేయిస్తూ ఉంటారు. అలా పూజ చేయించిన వారికి ఆశించిన ఫలితాలు లభిస్తున్నాయని అంటారు. అందుకే చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ఇక్కడి గణపతిని దర్శిస్తుంటారు .. ఆయన అనుగ్రహాన్ని కోరుతుంటారు.

More Bhakti Articles