భక్తులకు అభయాన్నిచ్చే ఆంజనేయుడు
జీవితంలో వివిధ రకాల సమస్యలు చుట్టుముడుతూ వుంటాయి ... అనేక రకాల కష్టాలు ఎదురవుతూ వుంటాయి. అలాంటి వాటి బారి నుంచి తమని కాపాడమని ప్రతిఒక్కరూ దైవాన్ని కోరుతూ వుంటారు. సాధారణంగా ఆపదలు ... కష్టాలు ఎంతటి వారినైనా మానసికంగా కుంగదీస్తూ బలహీనులను చేస్తూ వుంటాయి. అలా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన భక్తులు ఎక్కువగా హనుమంతుడి ఆలయాలకు వెళుతుంటారు.
సీతారాములకే ధైర్యం చెప్పిన హనుమంతుడు, తమ కష్టాన్ని తీర్చడంలోను సాయపడతాడని భావిస్తుంటారు. సమస్యను పరిష్కరించుకునే జ్ఞానాన్నీ ... కార్యాన్ని సాధించుకురాగల ధైర్యాన్నీ ... వ్యాధులను దరిచేరనీయని ఆరోగ్యాన్ని అందిస్తాడని ఆశిస్తుంటారు. ఈ విశ్వాసం కారణంగానే హనుమంతుడి ఆలయాలు ఎప్పుడు చూసినా భక్తులతో సందడిగా కనిపిస్తూ వుంటాయి.
అలాంటి ఆలయాల జాబితాలో సికింద్రాబాద్ - మల్కాజ్ గిరి ఆలయం ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. కుదురుగా కనిపించే ఈ ఆలయం అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది. గర్భాలయంలోని స్వామివారిని చూడగానే, ఆయన అభయం ఇస్తున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. ఎదురుగా ఆయన వాహనమైన ఒంటె కనిపిస్తుంది. దాదాపు నాలుగు వందల సంవత్సరాలుగా ఇక్కడ కొలువైన స్వామివారు మహిమాన్వితుడని ఇక్కడి వాళ్లు చెబుతుంటారు.
అంకితభావంతో స్వామివారి ముందుంచే ధర్మ బద్ధమైన కోరిక ఏదైనా అది తప్పక నెరవేరుతుందని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఇక ఇదే ప్రాంగణంలో అన్నపూర్ణ సమేతుడైన ఆదిదేవుడు కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. శివుడు ... శివాంశ సంభూతుడిగా చెప్పబడుతోన్న హనుమంతుడు కొలువైన కారణంగా ఈ క్షేత్రం విశేషమైనదిగా ... విశిష్టమైనదిగా వెలుగొందుతోంది.