శివుడితో పాటు శ్రీహరిని పూజించిన రావణుడు
రావణాసురుడు మహా శివభక్తుడు ... ఆయన ఎంతగా శివుడిని ఆరాధించేవాడో, అంతగా శ్రీహరిని ద్వేషించేవాడు. అలాంటి రావణుడు శివుడితో పాటు శ్రీహరిని కూడా పూజించాడంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. అలా రావణుడితో శ్రీహరి పూజలందుకున్న అరుదైన క్షేత్రంగా 'అన్నవరం' దర్శనమిస్తుంది.
ఇక్కడ ఏకశిలా స్తంభం పీఠభాగంలో బ్రహ్మదేవుడు ... మధ్య భాగంలో శివుడు ... పై భాగంలో రమాసహిత సత్యనారాయణ స్వామి కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తూ వుంటారు. సీతను అపహరించేందుకు లంకానగరం నుంచి భద్రగిరికి బయలుదేరిన రావణుడు, హరిహరులు ఆవిర్భవించిన ఈ రత్నగిరి మీదకి రాగానే ఆయన పుష్పక విమానం ఒక్కసారిగా ఆగిపోయిందట. ఈ కొండపై హరిహరులు ఒకే పీఠంపై కొలువై ఉండటమే అందుకు కారణమని రావణుడు గ్రహించాడు.
ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని గుర్తించిన రావణుడు, ఇక్కడి శివుడిని దర్శించుకున్నాడు. ఒకే పీఠంపై శివుడితో పాటు శ్రీహరి కొలువైన కారణంగా ఆయనని కూడా ఆరాధించాడు. ఈ కారణంగానే ఇప్పటికీ బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడి ఉత్సవమూర్తులను 'రావణ వాహనం' పై ఊరేగిస్తూ వుండటం జరుగుతూ వుంటుంది. ఇక రావణాసురుడే కాదు, రామలక్ష్మణులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించారట. ఈ క్షేత్ర దర్శనం కారణంగానే, సీత కోసం వాళ్లు చేస్తోన్న అన్వేషణ ఫలించిందని చెప్పబడుతోంది.