జీవితంలో ఇవి ఎంతో విలువైనవి
జీవితంలో డబ్బుకున్న విలువ మరి దేనికీ లేదని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. డబ్బులోనే సుఖం వుంది ... సంతోషం వుందని భావిస్తుంటారు. డబ్బుతోనే ఆపదలు తీరతాయనీ ... అవసరాలు గట్టెక్కుతాయని నమ్ముతుంటారు. డబ్బే ప్రధానమనే ఆలోచనతో, తమకి తాముగా ఓ గిరి గీసుకుని ఇతరులకు దూరంగా ఉంటూ వుంటారు. తమ నుంచి ఇతరులు ధన సహాయాన్ని ఆశించడం కోసమే స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని అనుకుంటారు. దాంతో తమ పరిథిని మరింత తగ్గించుకుని, తమదైన చిన్న ప్రపంచంలో బతుకుతుంటారు.
ఇక ఇలాంటి వారికి గల ఆధ్యాత్మిక చింతన కూడా అంతంత మాత్రంగానే వుంటుంది. డబ్బు లేకపోవడమనేది అన్నింటి కన్నా అతిపెద్ద సమస్య అనే విషయం అందరూ అంగీకరించేదే. డబ్బు ఎంతో విలువైనదే అయినా, దాని కోసం బంధుమిత్రులకు దూరంకావడం మాత్రం సరైనది కాదు. డబ్బున్నప్పుడు వాళ్లు తమ అవసరాలకు ఏమైనా ఉపయోగపడతారేమోననే ఉద్దేశంతో, సన్నిహితులు సాయం కోరడం సహజం.
అప్పుడు వీలును బట్టి ... వాళ్ల అవసరాన్నిబట్టి సాయం చేయాలా వద్దా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. చేయలేకపోతే ఆ విషయాన్ని సున్నితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కష్టకాలంలో మనసుకు తగిలే దెబ్బలు జీవితమంతా గుర్తుండిపోతుంటాయి. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు ఎవరి అవసరం లేదనీ .. రాదనీ అనుకోవడం అమాయకత్వం.
అవసరాల్లో ... ఆపదల్లో డబ్బు ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అది కష్టాల్లో ఉన్న వాళ్లను ఓదార్చలేదు ... ఆపదలో ఉన్నవాళ్లను ఆత్మీయంగా పలకరిస్తూ ధైర్యం చెప్పలేదు. ప్రేమానురాగాలతో కూడిన ఒక చిన్న పలకరింపే, కోలుకోవడానికి మంత్రంలా పనిచేస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు. ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించడానికి డబ్బొక్కటి ఉండగానే సరిపోదు ... భగవంతుడి అనుగ్రహం కూడా వుండాలి.
సాయపడటంలోని సంతృప్తిని గురించి తెలియని వాళ్లే దానికి దూరంగా ఉంటూవుంటారు. అలా బంధుమిత్రులను దూరం పెట్టిన వాళ్లు ఆపద సమయంలో ఏకాకిలా ... ఒంటరిగా మిగిలిపోతుంటారు. పదిమందికీ తోచిన సాయం చేసే వాళ్లకు కష్టకాలం వస్తే, సమయానికి డబ్బులేకపోయినా ఆదుకునే హస్తాలు ఎక్కువగా వుంటాయి. గతంలో వాళ్లు ఇతరులకు చేసిన సేవలకు సంతోషించిన భగవంతుడు కూడా, వాళ్లకు సాయపడేవారిలో ఒకడవుతాడు.
డబ్బు చాలా విలువైనదే, అయితే ప్రేమానురాగాలను అందించే సన్నిహితులు అంతకుమించిన విలువైనవాళ్లనే విషయాన్ని మరచిపోకూడదు. ధనానికి గల ప్రాముఖ్యతనే కాదు, దైవారాధనలోని గొప్పతనాన్ని కూడా గుర్తించాలి. సాయం చేయడంలోనే సంతోషం ఉంటుందనీ ... కలిసి ఉండటంలోనే ఆనందం ఉంటుందని గ్రహించాలి.