శివుడి వరానికి తిరుగేముంటుంది ?
నిజమైన భక్తులు భగవంతుడిని వివిధ రకాలుగా పూజించాలనీ ... సేవించాలని ఆరాటపడుతుంటారు. ఈ నేపథ్యంలో తాము అనుకున్న విధంగా ఆ దైవాన్ని అలంకరించలేకపోయినా ... ఆరాధించలేకపోయినా అసంతృప్తికి లోనవుతుంటారు. ఆ భగవంతుడు తమకి మరింత శక్తిని ప్రసాదించి వుంటే, ఆయన సేవను వీలైనంత ఎక్కువగా చేసుకునేవాళ్లమని అనుకుంటూ వుంటారు.
అలాంటి మహాభక్తులలో 'వ్యాఘ్రపాద మహర్షి' మనకి ముందువరుసలో కనిపిస్తాడు. అనునిత్యం ఆదిదేవుడి సేవలోనే ఆయన తరించిపోతూ ఉండేవాడు. ఆ పరిసర ప్రాంతాలన్నీ గాలించి వివిధ రకాల పూలను సేకరించేవాడు. ఆ పూలతో పరమశివుడికి అభిషేకంచేస్తూ పరవశించిపోయేవాడు. అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ మహర్షిని ఒకరకమైన అసంతృప్తి ఆవహిస్తుంది. ఎంత కష్టపడినా కొన్నిరకాల పూలతో మాత్రమే ఆ సదాశివుడిని అర్చిస్తున్నందుకు ఆయనకి బాధకలుగుతుంది.
దాంతో వివిధ రకాల పూలను సేకరించేందుకుగాను వేగంగా ప్రయాణించే శక్తిని తనకి ప్రసాదించవలసిందిగా ఆ పరమేశ్వరుడిని ప్రార్ధిస్తాడు. దాంతో ఆ సర్వేశ్వరుడు ప్రత్యక్షమై, పులితో సమానమైన వేగంతో ప్రయాణించే శక్తిని ఆ మహర్షికి ప్రసాదిస్తాడు. తనకి అంతటి శక్తిని అనుగ్రహించిన దేవదేవుడికి కృతజ్ఞతలు తెలియజేసిన మహర్షి, తాను అనుకున్న విధంగా ఆ స్వామిని సేవించడంలో నిమగ్నమవుతాడు. పులితో సమానమైన వేగంతో ప్రయాణించే వరాన్ని కలిగి వుండటం వల్లనే ఈ మహర్షికి 'వ్యాఘ్రపాద మహర్షి' అనే పేరు వచ్చింది.