ఇప్పటికీ ఇక్కడ దేవతలే గొడుగుపడతారట !
పెంచలకోన లక్ష్మీనృసింహస్వామి పేరు వినని వాళ్లు వుండరు. ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించిన స్వామి అంతగా భక్తుల హృదయాలతో పెనవేసుకుపోయాడు. ఎంతోమంది దేవతలు ... మహర్షులు ఈ స్వామిని సేవించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. అంగరంగ వైభవంగా ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు.
ఈ బ్రహ్మోత్సవాల సమయంలోనే దేవతలు వచ్చి స్వామివారికి గొడుగుపడతారనీ, ఆ దృశ్యం ఛాయా మాత్రంగా కొంతమంది భక్తులకు కనిపిస్తూ ఉంటుందని ఇక్కడి వాళ్లు చెబుతుంటారు. పరమపవిత్రమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో, ప్రతి యేటా వైశాఖ మాసంలో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు.
ఆయా క్షేత్రాల్లో స్వామివారికి ఉత్సవాలు ... ఊరేగింపులు జరుగుతున్నప్పుడు ఉపచారాలలో భాగంగా 'ఛత్రం'(గొడుగు) పడుతుంటారు. సాధారణంగా ఆలయ అర్చకులే స్వామివారికి ఇలా గొడుగు పడుతూ వుంటారు. ఇక పెంచలకోన నృసింహస్వామికి బ్రహ్మోత్సవాల సమయంలోను ఇదే పద్ధతి కనిపిస్తుంది. ఇక విశేషమేమిటంటే ... ఇక్కడి 'నృసింహగుండం' అనే పేరుతో పిలవబడే జలాశయంలో స్వామివారికి స్నానం చేయించడం.
ఈ సమయంలో స్వామివారికి దేవతలే గొడుగు పడతారని స్థానికులు చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా 'గొడుగు ఆకారం' ఆకాశంలో ఛాయామాత్రంగా కొంతమంది భక్తులకు దర్శనమిస్తూ ఉంటుందట. ఈ దృశ్యాన్ని చూడగలిగిన భక్తులు తమ జన్మ ధన్యమైనదని భావిస్తూ వుంటారు ... ఆ తన్మయత్వంలోనే తరిస్తూ వుంటారు.