ఈ పుణ్యంలో వాళ్లకీ భాగం లభిస్తుంది !
దేవుడికి సంబంధించిన ప్రతి పూజలోను పూలు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాయి. పూలలోని వివిధ రకాలను పూజకి ఉపయోగిస్తూ వుంటారు గానీ, అసలు పూలే లేకుండా పూజ మాత్రం చేయరు. సాధారణంగా ఇంట్లోగానీ ... ఆలయంలో గాని పూజ అనగానే కొంతమంది అందుకు అవసరమైన పూలను కొనుగోలు చేస్తుంటారు. మరి కొంతమంది తమ ఇంట్లోని చెట్లకి గల పూలతో పాటు, ఇరుగు పొరుగు వారి చెట్ల నుంచి కూడా పూలు కోస్తుంటారు.
ఇక ఆలయానికి వచ్చే వాళ్లలో కొందరు, ఆలయ ప్రాంగణంలో గల చెట్ల నుంచి పూలుకోసి లోపలికి తెస్తుంటారు. అయితే ఏదో విధంగా దైవానికి పూలను సమర్పించాము ... కావలసినంత పుణ్యం వస్తుందని అనుకుంటూ వుంటారు. నిజానికి మనం పూలను సమర్పించిన విధానాన్ని బట్టే పుణ్యం వస్తుంది. కొనుగోలు చేసిన పూలను ... తమ ఇంట్లో కాసిన పూలను స్వామివారికి సమర్పించడం వలన, ఆ భక్తులకు పరిపూర్ణమైన ఫలితం దక్కుతుంది.
ఇతరుల చెట్లకి కాసిన పూలను దైవానికి సమర్పించడం వలన ఆ పుణ్యంలో సగభాగం ఆ పూల చెట్ల యజమానులకు వెళుతుంది. ఇక ఆలయానికి వస్తూ అక్కడి ప్రాంగణంలో గల పూల మొక్కల నుంచి పూలను కోయకూడదు. దైవం కోసమే పెంచే పూలచెట్లను తాకకూడదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ నేపథ్యంలో ఇంకో విషయాన్ని కూడా మరిచిపోకూడదు. ఎవరైనా పూజకు అవసరమైన పూలను మన పూల మొక్కల నుంచి కోస్తూ వుంటే వారించకూడదు. అనవసరమైన మాటలతో వారిని అవమానపరచకూడదు.
ఒకవేళ తమ పూల మొక్కలు ఇతరులు తాకడానికి ఇష్టపడకపోతే, వాళ్లు కోరిన పూలను స్వయంగా కోసి ఇవ్వడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక పూలనేవి కొనుగోలు చేసినవే అయినా ... ఇతరుల చెట్ల నుంచి కోసినవే అయినా, అవి తాజాగా ... పరిమళాలు వెదజల్లుతూ ఉండగానే వాటిని దైవానికి సమర్పించాలనే విషయాన్ని మరిచిపోకూడదు.