ఈ కాలంలో ఈ పనులు చేయకూడదా ?

ఈ కాలంలో ఈ పనులు చేయకూడదా ?
వివాహాది శుభాకార్యాలను తలపెట్టేవారికీ, దైవకార్యాల్లో పాల్గొనే వాళ్లకి 'కర్తరి' గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఎందుకంటే వాళ్లు ఇందుకు సంబంధించిన నియమ నిబంధలను పాటిస్తూనే వుంటారు. కొత్తగా కొన్ని కార్యక్తమాలను తలపెట్టడానికి ఇది అనుకూలమైన కాలం కాదని చెప్పబడుతోంది. ఈ కాలంలో కాకుండా తరువాత జరుపుకోమని కొన్ని కార్యక్రమాలను వేరు చేస్తున్న కారణంగా 'కర్తరి'ని 'కత్తెర'గా కూడా పిలుస్తుంటారు.

ఈ నేపథ్యంలో ముందుగా 'డొల్లుకర్తరి' ... ఆ తరువాత 'నిజకర్తరి' ఆ తరువాత 'కర్తరిత్యాగం' ఆరంభమవుతుంటాయి. సూర్యుడు భరణీ నక్షత్రంలోని మూడు .. నాలుగు పాదాలలోను, కృత్తికా నక్షత్రంలోని నాలుగు పాదాలలోనూ, రోహిణీ నక్షత్రంలోని మొదటి పాదంలోను సంచరిస్తోన్న కాలాన్ని 'కర్తరి' అని పిలవడం జరుగుతోంది. ఈ కాలం కొన్ని కార్యక్రమాలకు అనుకూలమైతే ... మరికొన్నింటిని వాయిదా వేసుకోవడమే మంచిదని శాస్త్రం చెబుతోంది.

కర్తరీ కాలంగా చెప్పబడుతోన్న ఈ సమయలో పెళ్లిళ్లు ... ఉపనయనాలు ... గృహప్రవేశాలు జరుపుకోవచ్చని సెలవిస్తోంది. ఈ సమయంలో పంటలపరంగా గానీ, నిర్మాణాల నిమిత్తం గాని .. ఇలా ఏ కారణం చేత కూడా భూమిని త్రవ్వకూడదు. అలాగే అడ్డం వస్తున్నాయని గానీ ... కలప నిమిత్తంగాని చెట్లు కొట్టకూడదు. కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి పనులు ప్రారంభించకూడదు. అలాగే నూతన వాహనాలను కొనుగోలు చేయడంగానీ, వాటిని అధిరోహించడంగాని చేయకూడదని శాస్త్రం స్పష్టం చేస్తోంది.

More Bhakti Articles