హనుమంతుడి మనసు ఎలా గెలుచుకోవాలి ?
భగవంతుడు దివి నుంచి భువికి దిగివస్తే ... ఎదురుగా వచ్చి కనిపిస్తే ఏంచేస్తావని ఎవరినైనా అడిగితే తమకి ఇష్టమైనమేవిటో చెప్పి, వాటిని ప్రసాదించవలసిందిగా కోరతామని అంటూవుంటారు. అలాంటిది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ... శ్రీరాముడిగా వచ్చి ఎదురుగా నిలబడితే, తనకోసం హనుమంతుడు ఏదీ కోరకపోగా, ఆయనకే ఎదురు సాయం చేశాడు. అందుకే హనుమంతుడు భక్తుడే కాదు .. భగవంతుడూ అయ్యాడు.
అలాంటి హనుమంతుడు ఎక్కడ రామనామం వినిపిస్తుందో ... ఎక్కడ రామాయణ పఠనం జరుగుతుందో అక్కడికి ఏదో ఒక రూపంలో వస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలా రామకథామృతాన్ని వినడానికి వచ్చిన హనుమంతుడిని గుర్తించే, ఆయన ద్వారా రాముడి సాక్షాత్కారాన్ని తులసీదాస్ పొందడం జరిగింది. ఇక హనుమంతుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్లకి ఆయన జయంతికి మించిన అవకాశం దొరకదని చెప్పవచ్చు.
హనుమంతుడి జయంతి రోజున ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించడమే కాదు, రామాయణం ... సుందరకాండలతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. హనుమాన్ చాలీసా పదకొండుమార్లు పారాయణం చేయడం వలన, ఆ స్వామి అపారమైన కృపాకటాక్షాలను వర్షింపజేస్తాడని చెప్పబడుతోంది. ప్రశాంతమైన ... పవిత్రమైన ప్రదేశాల్లో ఈశాన్య మూలలో కూర్చుని, అంకిత భావంతో ఈ పారాయణ చేస్తూ వుంటే ఆయన అదృశ్య రూపంలో తప్పక వస్తాడని అంటారు.
ఇక తులసిచెట్టు చుట్టూ గానీ ... రావిచెట్టు చుట్టూ గాని ప్రదక్షిణలు చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన ఆయన మనసు గెలుచుకోవడం మరింత తేలిక అవుతుంది. అందుకే హనుమంతుడిని సేవించుకోవడానికీ, ఆయన మనసును గెలుచుకోవడానికి అవకాశాన్ని కల్పించే హనుమజ్జయంతిని వదులుకోకూడదు. హనుమంతుడు తన కరుణా కిరణాలను ప్రసరింపజేస్తే, ఆరోగ్యం ... ఐశ్వర్యం ... అన్నింటా విజయాలు లభిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.