తప్పుచేసినవారిని దండించే దేవుడు
శిలకు ఒక ఆకారాన్ని తీసుకువచ్చి దానిని దైవంగా పూజించడం ... ఆ శిలకు ప్రాణం ఉందనీ ... అదెన్నో మహిమలు చేస్తుందని నమ్మడం అమాయకత్వమని కొంతమంది భావిస్తుంటారు. సాధారణంగా ఇలా వాదించే వాళ్లు దేవుడిని నమ్మరు ... అందువలన ఆయనంటే వాళ్లకి ఎలాంటి భయమూ వుండదు. దేవుడంటే నమ్మకంలేని వాళ్లు ... ఆయన అంతా చూస్తూనే ఉంటాడని తెలియని వాళ్లే ఆయన సన్నిధిలో తప్పు చేయడానికి ప్రయత్నిస్తుంటారు.
ఈ కారణంగానే ఆయా దైవాలు కొలువైన గ్రామాల్లో అనేక అక్రమాలు కొనసాగుతుంటాయి ... అక్కడి దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో వాళ్లకి ఆ భగవంతుడు బుద్ధిచెబితే మరోమారు అలాంటి పనులు చేయరు. అక్కడ స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడనే విశ్వాసం భక్తులకు కూడా కలుగుతూ వుంటుంది. అలాంటి నమ్మకాన్ని సొంతం చేసుకున్న క్షేత్రంగా 'శని శింగణాపూర్ ' దర్శనమిస్తుంది.
శనిదేవుడు స్వయంభువుగా ఆవిర్భవించిన పరమపవిత్రమైన క్షేత్రం ఇది. ఇక్కడి స్వామిని అభిషేకించడానికీ ... ఈ గ్రామానికి మంచి చేయడానికి తప్ప మరే దురుద్దేశంతో ఎవరూ అడుగుపెట్టలేరని స్థానికులు చెబుతుంటారు. స్వామివారి సమీపంలో నివసించే వాళ్లెవరూ తమ ఇంటికి తాళాలు వేయరు. స్వామియే తమనీ ... తమ ఆస్తులను కాపాడుతూ ఉంటాడని గ్రామస్తులు భావిస్తుంటారు.
ఇదంతా అమాయకత్వమని నవ్వుకున్న కొంతమంది దొంగలు, ఒకప్పుడు ఈ గ్రామంలో దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. వాళ్లంతా కూడా చూపుకోల్పోయి గ్రామస్తులకు పట్టుబడ్డారు. ఈ విషయం తెలిసిన వాళ్లెవరూ ఇలాంటి సాహసం చేయడానికి పూనుకోలేదు. ఇక దుర్బుద్ధితో ఈ గ్రామంలోకి అడుగుపెట్టినవారిని పొలిమేరల వరకూ స్వామి తరిమికొట్టిన సందర్భాలు లేకపోలేదు.
ఇలా స్వామి చూపిన మహిమలు ఇక్కడ కథలు కథలుగా వినిపిస్తూ వుంటాయి. భక్తులను అనుగ్రహించి ... దుర్మార్గులను భయపెట్టే ఈ స్వామిని మహిమాన్వితుడుగా చెప్పుకుంటూ వుంటారు. అనునిత్యం ఆయనని సేవిస్తూ అనుగ్రహాన్ని పొందుతూ వుంటారు.