కొత్తబట్టలు -పసుపు
పుట్టిన రోజులు ... పెళ్లి రోజులు ... పండుగలు ... పర్వదినాలు ... ఇలా విశేషమైనటు వంటి రోజుల్లో కొత్త బట్టలు ధరించడాన్ని అందరూ ఇష్టపడుతుంటారు. కొత్తబట్టలు ధరించడంలోగల ఆనందం వేరు ... అవి అందించే ఉత్సాహం వేరు. ఇక కొత్తబట్టలు వచ్చాయనే ఆతృతలో పిల్లలు వాటిని వేసుకోబోతుండగా, తల్లిదండ్రులు వారించి వాటికి అక్కడక్కడ కాస్త పసుపు రాస్తారు. ఇలా నూతన వస్త్రాలకు పసుపు రాయడమనేది ఆచారంగా వస్తోంది. ఇలా పసుపు రాసే ఆచారం వెనుక అసలైన అర్ధం లేకపోలేదు.
పవిత్రమైన కార్యక్రమాల్లో పసుపు ప్రధాన పాత్రను పోషిస్తూ వస్తోంది. పసుపును అంతా మంగళకరమైనదిగా భావిస్తుంటారు. అంతే కాకుండా పసుపు క్రిమిసంహారిణిగా సమర్ధవంతంగా పనిచేస్తుంది. వివిధ దశలలో ఎన్నో రూపాంతరాలు చెందిన తరువాత గాని ఒక వస్త్రం బయటికి రాదు. పట్టు ... నూలు ... ఉన్ని వస్త్రాల తయారీ సమయాల్లో కొన్ని రకాల సూక్ష్మ క్రిములు వస్త్రంలో కలిసి పోతుంటాయి. ఫలితంగా అవి ధరించిన వారు అనారోగ్యానికి గురవుతూ వుంటారు.
ఇక ఇటు అమ్మకపు దారులు ... అటు కొనుగోలు దారుల మధ్య చేతులు మారడం వలన కూడా కొత్తబట్టలకు సూక్ష్మ క్రిములు ఉంటూ వుంటాయి. అలాంటి సూక్ష్మ క్రిముల బారిన పడకుండా వుండటం కోసం నూతన వస్త్రాలకు పసుపు రాస్తూ వుంటారు. ఇక పసుపు లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతున్న కారణంగా, అశుభకార్యాల్లో పెట్టే వస్త్రాలకు మాత్రం పసుపు రాయరు.