ప్రసాదం పంచితే కలిగే ఫలితం
దైవానికి నివేదన చేసిన ఏపదార్థమైనా ప్రసాదమే. అలాంటి ప్రసాదాన్ని పదిమందికీ పంచినప్పుడే పుణ్యం లభిస్తుందని చెప్పబడుతోంది. సాధారణంగా దేవాలయాల్లో పులిహోర .. చక్రపొంగలి ... దద్యోధనం వంటి అన్నప్రసాదాలు, కేసరి ... జిలేబి ... లడ్డు వంటి తీపి ప్రసాదాలు దైవానికి నైవేద్యం పెట్టిన తరువాత పంచుతుంటారు. దైవ దర్శనం అనంతరం ప్రసాదాలు స్వీకరించడం వల్లనే పరిపూర్ణమైన ఫలితం దక్కుతుందని భక్తులు భావిస్తుంటారు.
సాధారణ ఆలయాల్లో ఒక్కోపూట ఒక్కో నైవేద్యం పెడుతుంటారు. ఈ నేపథ్యంలో ముందుగా ఆలయానికి వచ్చినవారికి ప్రసాదం దొరకడం, ఆలస్యంగా వచ్చినవారికి ప్రసాదం లభించకపోవడం జరుగుతూ వుంటుంది. దాంతో ప్రసాదం లభించని వాళ్లు ఒకరకమైన నిరుత్సాహానికి లోనవుతుంటారు. ప్రసాదం తీసుకున్న వాళ్లు ... అది అందని వాళ్లను పట్టించుకోకపోవడం నిజంగా విచారించదగిన విషయం.
మనకి లభించిన ప్రసాదంలో దైవాన్ని స్మరించుకుని గోరంత నోట్లో వేసుకుని, మిగతాది ప్రసాదం అందనివారికి పంచిపెట్టాలి. ఇక పుణ్యక్షేత్రాలకి వెళ్లి వచ్చిన వాళ్లు .. అక్కడి నుంచి తెచ్చిన ప్రసాదాలను ఇరుగు పొరుగువాళ్లలో తమతో బాగా చనువుగా ఉండేవారికి మాత్రమే పంచుతుంటారు. భగవంతుడి ప్రసాదాలను పంచడానికి పరిచయాలతో పనిలేదు. వీలైనంత ఎక్కువమందికి అది చేరాలనే ఉద్దేశంతో అందరికీ పంపిణీ చేయాలి. ప్రసాదం ఎక్కువగా తిన్నందువలన ఎక్కువ ఫలితం ... తక్కువగా తిన్నందువలన తక్కువ ఫలితం రావడం జరగదు.
నిజానికి ప్రసాదమనేది కొంచెంగా మాత్రమే తీసుకోవాలి గానీ, అల్పాహారంగా స్వీకరించకూడదు. పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన ప్రసాదమైనా ... కాలనీలోని ఆలయంలో పెట్టిన ప్రసాదమే అయినా ఇతరులతో కలిసి పంచుకున్నప్పుడే దాని ప్రయోజనం నెరవేరుతుంది. పవిత్రమైన భగవంతుడి ప్రసాదాలను పంచడం వలన సమస్త పాపాలు నశించడమే కాకుండా, ఉత్తమగతులు కలుగుతాయని చెప్పబడుతోంది. ఇక ఈ ఫలితాన్ని ఆశించే వాళ్లు ... ఒక్కో రోజున ఒక్కో ప్రసాదం తయారుచేయించి భక్తులకు పంపిణీ చేయించవచ్చు.