కీర్తి ప్రతిష్ఠలను సూచించే కలలు

కీర్తి ప్రతిష్ఠలను సూచించే కలలు
కొంతమందికి ఆరోగ్యంపట్ల ... మరికొంతమందికి ఐశ్వర్యంపట్ల ఆసక్తి వుంటుంది. ఇక కీర్తి ప్రతిష్ఠల విషయానికి వచ్చేసరికి ఆసక్తిని కనబరచని వారంటూ వుండరు. తమకి సంబంధించిన రంగంలో తాము రాణించాలనీ, సమాజంలో కీర్తిప్రతిష్ఠలను పొందాలనే ఆశ ... ఆరాటం చాలామందికి వుంటుంది. అయితే అది నిజమవుతుందా ... లేదా ? అనే విషయాన్ని గురించి ఆలోచిస్తూ వాళ్లు సతమతమైపోతుంటారు. ఇలాంటివారికి వచ్చే కొన్ని కలలు, వాళ్ల కోరిక నెరవేరుతుందో లేదో ముందుగానే చెప్పేస్తుంటాయి.

కలలో నీటి ప్రవాహం కనిపించడం త్వరలో కలగనున్న కీర్తి ప్రతిష్ఠలను సూచిస్తుంది. ఇక సువిశాలమైన వీధుల్లో తాను దర్జాగా నడచి వెళుతున్నట్టుగా కల వచ్చినట్టయితే, కీర్తిప్రతిష్ఠలు తలుపు తట్టే సమయం ఆసన్నమైందని గ్రహించాలి. తాను దీపాన్ని వెలిగించినట్టు ... ఆ వెలుగు ఆ పరిసరాలలో పరచుకుంటూ కాంతివంతం చేస్తున్నట్టుగా కల వస్తే, పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలకు సంకేతంగా భావించాలి. ఇక కలలో ఇష్టదేవతలు ఆశీర్వదించడం ... తాను ఏనుగును ఎక్కి తిరుగుతున్నట్టుగా కనిపించడం జరిగితే ఆయా రంగాల్లో కీర్తిప్రతిష్ఠలను అందుకోవడం జరుగుతుంది.

అలాగే పాలుగానీ ... పెరుగుగాని తాగుతున్నట్టుగా కలలో కనిపిస్తే, త్వరలో పొందనున్న కీర్తిప్రతిష్ఠలకు అది సూచనగా భావించాలి. సాధారణంగా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగివుంటుంది. ఆ ప్రతిభే వారికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెడుతూ వుంటుంది. పైన చెప్పిన దృశ్యాలు కలలో కనపడటం వలన వారి ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుందని భావించాలి. ప్రత్యేకమైన ఆ గుర్తింపు కారణంగా సమాజంలో వారికి కీర్తిప్రతిష్ఠలు కలుగుతాయని విశ్వసించాలి.

More Bhakti Articles