సంతానాన్ని ప్రసాదించే కప్ప స్తంభం
అనారోగ్యాలతో ... ఆర్ధికపరమైన సమస్యలతో నానాబాధలు పడుతున్న వాళ్లు ఆ దేవుడి అనుగ్రహాన్ని కోరుతూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంటారు. అలాగే వివాహం ... సంతానం ఆలస్యమవుతున్నప్పుడు, అందుకు పరిష్కారమార్గాన్ని చూపించమని దైవాన్ని కోరడం కోసం మరికొందరు క్షేత్రదర్శనం చేస్తుంటారు. నిజంగానే వాళ్ల కోరికలు నెరవేరతాయా అంటే, నెరవేరతయనే చెప్పాలి. స్థల మహిమ ... దైవానుగ్రహమే వాళ్లు ఆశించినవి అందించడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి.
ఇక సంతానం విషయాన్నే తీసుకుంటే ... వివాహమైన ప్రతి స్త్రీ సంతానం కోసం పరితపిస్తుంది. సంతానం ఆలస్యమైతే ఆందోళన చెందుతూ, దైవానుగ్రహాన్ని కోరుతూ ఎన్నో పూజలు చేస్తుంది. వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించి ముడుపులు కడుతుంది. ఆయా తీర్థాల విశేషాన్ని తెలుసుకుని వాటిలో స్నానాలు చేస్తుంది. ఇలా మాతృత్వం కోసం ఆరాటపడేవారికి 'కప్పస్తంభం' ఒక ఆశాదీపంమని చెప్పవచ్చు.
కప్ప స్తంభం అనగానే అందరికీ 'సింహాచలం' క్షేత్రం గుర్తుకు వస్తుంది. వరాహ నరసింహస్వామి .. అప్పన్నగా పిలిపించుకుంటోన్న ఈ క్షేత్రంలోనే మహిమాన్వితమైన 'కప్ప స్తంభం' కనిపిస్తుంది. ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్లు ఇక్కడి పుష్కరిణిలో స్నానమాచరించి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుంటూ వుంటారు.
స్త్రీలకు సంతాన భాగ్యాన్ని కల్పించడం కోసం దేవతలే ఈ స్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనీ, ఈ స్తంభంలో సంతాన గోపాల యంత్రం ప్రతిష్ఠించబడి వుందని స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగా ఇది మహిమాన్వితమైన స్తంభమనీ ... దీనిని దర్శించిన వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.