వైశాఖ పౌర్ణమి రోజున ఏంచేస్తే పుణ్యం ?
ఎవరు ఎంత పుణ్యాన్ని మూటగట్టుకున్నారో ... ఎంత పాపాన్ని వెనకేసుకున్నారో ఎవరికీ ప్రత్యక్షంగా తెలియదు. నడుస్తున్న కాలం ... గడుస్తున్న రోజులే వీటి శాతాన్ని సూచిస్తూ వుంటాయి. పాపపుణ్యాలనేవి తెలిసిచేసినా ... తెలియకచేసినా దేని ఖాతాలో అది జమ అవుతూనే వుంటుంది. పరిస్థితులు తలక్రిందులు అయినప్పుడు, అలా జరగడానికి కారణం తాము చేసిన పాపాలేననే విషయం చాలామందికి గుర్తుకు వస్తుంది.
పాపాల నివృత్తి కోసం వాళ్లు వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తూ వుంటారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ... దానధర్మాలు చేస్తుంటారు. ఇంత చేసినా తమని వెంటాడుతోన్న పాపాలు తొలగిపోయాయో లేదోననే సందేహం వాళ్లలో తలెత్తుతుంటుంది. ఇలాంటివారికి భగవంతుడు ప్రసాదించిన వరంగా 'వైశాఖ పౌర్ణమి'ని గురించి చెప్పుకోవచ్చు. వైశాఖ పౌర్ణమినే 'మహా వైశాఖి' గా పిలుస్తుంటారు.
అనంతమైన పుణ్యఫలాలను అందించే ఈ రోజుని ప్రజలంతా పర్వదినంగా భావిస్తుంటారు. అత్యంత విశిష్టమైన ఈ రోజున శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, శ్రీమహావిష్ణువును ఆరాధించాలి. ఆలయానికి వెళ్లి అక్కడి ప్రాంగణంలో గల రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. ఆలయంలో కూర్చుని విష్ణు సంబంధిత భజనలు ... పారాయణాలు చేయాలి.
ఈ మాసంలో ఎండలు మండిపోతూ వుంటాయి కనుక, వాటి బారి నుంచి రక్షణ కల్పించే గొడుగు ... విసన కర్రలు ... పాదరక్షలు ... మంచినీళ్లు దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా విష్ణుమూర్తిని పూజించడం వలన ... దానధర్మాలు చేయడం వలన, విశేషమైన పుణ్యఫలాలు లభించడమే కాకుండా ఉత్తమగతులు కలుగుతాయని స్పష్టం చేస్తోంది.