గుమ్మానికి ఎదురుగా పాదరక్షలు విడిస్తే ?
పాదరక్షలు గుమ్మం బయటే ఉండాలనే మాట పెద్దలు పదేపదే చెబుతుంటారు. గుమ్మం బయట అంటే గుమ్మానికి ఎదురుగా అనుకుని కొందరు అక్కడే పాదరక్షలను విడుస్తూ వుంటారు. ఈ విధంగా పాదరక్షలను గుమ్మానికి ఎదురుగా విడవడం వలన, ఆ కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది. పాదరక్షలు అనేవి పాదాలకు రక్షణ కల్పించడం మినహా, వాటి ద్వారా మరో ప్రయోజనం గానీ .. ఇతర దోషాలు గాని ఉండవని చాలామంది అనుకుంటూ వుంటారు.
మరో ప్రయోజనం సంగతిని అలా ఉంచితే, వాటిని ఉంచవలసిన ప్రదేశంలో ఉంచకపోతే అనేక ఇబ్బందులను కొనితెచ్చుకున్నట్టు అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాదరక్షలతో అనేక ప్రదేశాల్లో తిరిగి ఇంటికి రావడం జరుగుతుంది. అపవిత్రమైన ప్రదేశాల్లో తిరగడం వలన ... కొంతమంది తంత్ర పూర్వకమైన ప్రయోగాలు చేసి దారిలో పోసిన వాటిని దాటడం వలన పాదరక్షలను పట్టుకుని ఆ శక్తులు ఇంటి వరకూ వస్తాయి.
ఈ కారణంగానే పాదరక్షలను గుమ్మానికి ఒకవైపున కాస్త దూరంగా విడిచి, కాళ్లు కడుక్కుని లోపలికి రావాలనే పద్ధతిని మన పెద్దలు ప్రవేశపెట్టారు. కానీ ఈ కాలంలో చాలామంది పాదరక్షలను ఓ పక్కన కాకుండా గుమ్మంముందే విడిచి అలాగే లోపలికి వచ్చేస్తుంటారు. మరికొంతమంది ఇంట్లో కూడా పాదరక్షలు ధరించి తిరుగుతూ వుంటారు. పాదరక్షలు గుమ్మానికి ఎదురుగా ఉండటం వలన లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్లిపోతుంది. ఇక ఇంట్లో కూడా పాదరక్షలు ధరించే అలవాటు ఉన్నచోటు నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది.
లక్ష్మీదేవి వెళ్లిపోవడం ... పాదరక్షలను పట్టుకుని దుష్టశక్తులు రావడం వలన ఆ ఇంట్లో ఆరోగ్యపరమైన ... ఆర్ధికపరమైన ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా మానసిక ప్రశాంతత కరువై, నిరాశా నిస్పృహలతో కాలాన్ని భారంగా గడపవలసి వస్తుంది. అందువలన గుమ్మానికి ఎదురుగా పాదరక్షలు విడిచే వాళ్లు తక్షణమే ఆ అలవాటును మానుకోవడం అన్ని విధాలా మంచిదని చెప్పవచ్చు.