వైశాఖమాసంలో వేటిని దానం చెయ్యాలి ?
వైశాఖమాసం అనేక విశేషాలకు వేదికగా కనిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో నదీ స్నానాలు ... శక్తి కొద్ది దానాలు అనంతమైన ఫలితాలను అందిస్తాయని అంటున్నాయి. దాంతో ఎవరి స్థాయిలో వాళ్లు దానధర్మాలు చేయడానికి ముందుకు వస్తుంటారు. అయితే ఏదిపడితే అది దానం చేయడం వలన ఆశించిన ఫలితాన్ని అందుకోవడానికి సమయం పడుతుంది.
అదే .. దానాన్ని గ్రహించిన వాళ్లకి ఆ దానం వలన వెంటనే ఉపయోగం వుంటే, చేసినవారికి అంతే త్వరగా ఫలితం కనిపిస్తుంది. ఇలా ఆశించిన ఫలితాన్ని త్వరగా పొందాలనుకుంటే, దానం చేసే వాళ్లు ఆయా కాలాలాను బట్టి ... అవసరాలను బట్టి దానం చేయవలసి వుంటుంది. అలా వైశాఖ మాసం విషయానికి వచ్చే సరికి, ఈ మాసంలో ఎండలు విపరీతంగా వుంటాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక సాధారణ ప్రజలు నానాఅవస్థలు పడుతుంటారు.
అలాంటి వారికి 'చలివేంద్రాలు' ద్వారా మంచినీటి దానం చేస్తూ వారి దాహార్తిని తీర్చాలి. అంతే కాకుండా వేసవి కాలపు ఎండలను తట్టుకునే విధంగా గొడుగులు ... పాదరక్షలు ... విసన కర్రలు ... దానం చేయవలసి వుంటుంది. ఇవి తక్కువ ఖర్చుతో వీలైనంత ఎక్కువమందికి దానంగా అందించే అవకాశం వుంటుంది. ఎండవేడిమి నుంచి తక్షణమే ప్రజలకు ఉపశమనాన్ని అందించినట్టు అవుతుంది. ఈ విధంగా తక్షణమే ప్రయోజనాన్ని కలిగించే దానాలను వైశాఖ మాసంలో చేయడం వలన సకల శుభాలు చేకూరతాయనీ, ఉత్తమగతులు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.