ఈ ఆచారం వెనుక అర్థం ఇదే !
భారతీయుల వివాహ వ్యవస్థ ఎంతో పటిష్ఠంగా కనిపిస్తుంది. ప్రాంతాలను బట్టి ... సంప్రదాయాలను బట్టి వివాహ పద్ధతులలో కాస్త మార్పులు కనిపించినా, నూతన వధూవరుల మధ్య కొత్తదనాన్ని పోగొట్టి వారిమధ్య చనువును పెంచే దిశగానే ఆచారాలు ఉంటూ వుంటాయి. వివాహమైన తరువాత అమ్మాయి - అబ్బాయి మూడునిద్రలు చేయాలనే ఆచారం ఒకటి కనిపిస్తుంది.
దాంతో పెళ్లికాగానే అమ్మాయి భర్తతో కలిసి అత్తగారింటికి వెళుతుంది. అలా అత్తగారింట్లో మూడు రోజులు వున్న తరువాత, ఆమెను వెంటబెట్టుకుని అబ్బాయి తన అత్తగారింటికి బయలుదేరుతాడు. అత్తగారింట్లో అబ్బాయి కూడా మూడురోజుల పాటు ఉండవలసి వస్తుంది. అమ్మాయి అత్తగారింటికి వెళ్లేటప్పుడు ఆమెతో పాటు ఆమెకి బాగా దగ్గరివాళ్లు తోడుగా వెళతారు. అలాగే అబ్బాయితో పాటు అతని దగ్గరి బంధువులు కూడా తోడుగా వస్తారు.
ఇలా మూడురోజుల పాటు అబ్బాయింట్లో అమ్మాయి ... ఆ తరువాత మూడు రోజులపాటు అమ్మాయింట్లో అబ్బాయి వుండటం జరుగుతుంది. ఇలా ఉండటం వలన ఒకరి కుటుంబాన్ని ఒకళ్లు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఆ తరువాత కాపురానికి వచ్చే అమ్మాయికి తాను కొత్త ఇంటికి వస్తున్నాననే బెరుకుదనం వుండదు. ఈ మూడు రోజులపాటు కూడా అమ్మాయికి అలాంటి బెరుకు ఉండకూడదనే ఆమెతో చనువుగా ఉండే మరో కుటుంబసభ్యులు తోడుగా వస్తుంటారు.
ఇక ఎంత అబ్బాయే అయినా కొత్త పెళ్లికొడుక్కి కూడా కాస్త బెరుకుగా వుంటుంది కనుక, అతని విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. నూతన వధూవరుల మధ్య కొత్తదనం పోవడానికీ, ఒకరి కుటుంబసభ్యులను ఒకరు అర్థం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడమే ఈ ఆచారం వెనుకగల అర్థంగా చెప్పుకోవచ్చు.