ఈ నియమం పాటించక పోవడం దోషమే
భగవంతుడిని దర్శించుకోవడానికి ఆలయానికి వెళ్లినప్పుడు, ఆయనని ఆరాధించేటప్పుడు ... ఆయన లీలావిశేషాలను గురించి తెలుసుకునే సమయంలోను తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది. భగవంతుడికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రశాంతతను కోరుకోవడం జరుగుతూ వుంటుంది. మానసికపరమైన చిరాకుల నుంచి బయటపడేసే ప్రశాంతత కోసం చాలామంది ఆలయానికి వస్తూ వుంటారు. దైవ సంబంధమైన విషయాలను గురించి ఎవరైనా ప్రవచనాలు చెబుతున్నారని తెలిస్తే ప్రశాంతత కోసం అక్కడికి వెళుతూ వుంటారు.
ఇలాంటప్పుడు ఒకరి ప్రశాంతతకు ఒకరు భంగం కలిగించకుండా వ్యవహరించడం ఒక నియమంగా వుంటుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు జరిగే ప్రదేశాలకి కొంతమంది తమ పిల్లలను కూడా తీసుకువస్తుంటారు. ఆలయానికైనా ... ఆధ్యాత్మిక చింతన లభించే ప్రదేశాలకైనా ఎవరైనాసరే కుటుంబసభ్యులతో కలిసివెళదామనే అనుకుంటారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకురావడంలో ఎలాంటి తప్పులేదు.
అయితే పిల్లలు ఎక్కడ వున్నా ఎక్కడికి వెళ్లినా ఆటలు .. అల్లరి తప్ప వాళ్లకి మరో ధ్యాస వుండదు. అందువలన సహజంగానే ఇలాంటి ప్రదేశాల్లోనూ వాళ్లు అల్లరి చేస్తుంటారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై గల ప్రేమానురాగాల కారణంగా వాళ్లు చేసే అల్లరి అడ్డుగా అనిపించదు. అయితే ఈ అల్లరి మిగతా వాళ్లకి కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ఆ పిల్లలను మందలిస్తే వాళ్ల తల్లిదండ్రులు నొచ్చుకుంటారేమోనని ఓపిక పడుతుంటారు.
ఆలయాల్లో పిల్లల అల్లరి దైవంపై దృష్టి నిలపనివ్వకపోగా, ఆధ్యాత్మిక ప్రసంగాలలో చెప్పే వ్యక్తితో పాటు ... వినేవాళ్ల దృష్టిని కూడా మరల్చుతుంది. దైవారాధనకు ... ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పిల్లల కారణంగా అంతరాయం కలిగితే, ఆ దోషం తల్లిదండ్రులు అనుభవించవలసి వస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు. పిల్లలు దేవుడితో సమానమే ... అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలకు వాళ్ల అల్లరి ఆటంకం కలిగించకూడదు. అలా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులదే.
సహజంగానే పిల్లలు చేసే అల్లరిని తల్లితండ్రులు ఆ కాసేపు తప్పకుండా నియంత్రించ వలసి వుంటుంది. ఏడిస్తే మొదటికే మోసం వస్తుంది కనుక ... దండించకూడదు. లాలిస్తూ .. బుజ్జగిస్తూ సున్నితంగా వ్యవహరించాలి. అప్పుడే ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి ఆశించే మానసిక ప్రశాంతత అందరికీ లభిస్తుంది. అలాంటి ప్రదేశాలకి తరచుగా పిల్లలను తీసుకువెళుతూ ఉండటం వలన అక్కడి వాతావరణం వాళ్లకీ అలవాటు అవుతుంది.