పుణ్యక్షేత్రాలకి వెళితే ఇవి తెలుసుకోవాలి
ఒకే కుటుంబసభ్యులుగానీ ... లేదంటే కొన్ని కుటుంబాలవారు ఒక బృందంగా ఏర్పడి గాని పుణ్యక్షేత్రాలకు వెళుతుంటారు. వివిధ క్షేత్రాలను దర్శించి దైవ ప్రతిమలు ... చిత్రపటాలు కొనుక్కుని వెనుదిరుగుతారు. ఇంటికి వచ్చాక తాము ఫలానా పుణ్యక్షేత్రాలను చూసి వచ్చామని చెబుతూ ప్రసాదాలు పంచిపెడతారు. ఆయా ప్రదేశాల్లో తాము దిగిన ఫోటోలను ఓ అందమైన జ్ఞాపకంగా పదిలపరచుకుంటారు.
ఆ పుణ్యక్షేత్రాలను గురించిన వివరాలను అడిగితే మాత్రం తెలియదని చెప్పేస్తారు. గర్భాలయంలోని దైవాన్ని దర్శించుకుని, ప్రదక్షిణ పూర్వకంగా పరివార దేవతలను చూడటంతో, అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడంతో తాము వచ్చిన ప్రయోజనం నెరవేరిందని అనుకుంటారు. కానీ ఏ క్షేత్రానికి వెళ్లినా ఆ క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయం నుంచి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
స్వామి అక్కడ ఎందుకు ఆవిర్భవించాడు ? ... అక్కడి స్థల మహాత్మ్యం ఏమిటి ? ... పుష్కరిణి ప్రత్యేకత ఏమిటి ? ... ఏయే మహర్షులు ... మహారాజులు స్వామిని ఆరాధించారు ? ఏయే మహాభక్తులు అక్కడి స్వామిని కీర్తించారు ? ... స్వామివారికి ఆలయాన్ని నిర్మించినది ఎవరు ? ... ఆలయాన్ని అభివృద్ధి పరిచిన మహానుభావులు ఎవరు ? స్వామివారు ధరించే అతి ముఖ్యమైన ఆభరణాలు ... ఆయన సేవలకు ఉపయోగించే వాహనాలను ఎవరు సమర్పించారు ? అనే వివరాలను ఆసక్తిగా సేకరించాలి.
ఇక ఏయే రోజుల్లో ఎలాంటి ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు ? ... స్థానికంగా అక్కడ కనిపించే ఆచారాల వెనుకగల అర్థం ఏమిటి ? స్వామి పాదస్పర్శచే ప్రభావితమైన పరిసర ప్రదేశాల్లో చూడదగినవి ఏమైనా ఉన్నాయా ? తదితర వివరాలన్నింటి గురించి తప్పని సరిగా తెలుసుకోవాలి. ముందుగానే తెలుసుకుని చూడటం వలన మరింత మంచి అనుభూతి కలుగుతుంది. ఒక పుణ్య క్షేత్రం గురించి తెలుసుకోవడమంటే, పురాణపరమైన కొన్ని విషయాలు ... చారిత్రక పరమైన విషయాలు తెలుసుకున్నట్టే. అప్పుడే ఆ క్షేత్ర మహాత్మ్యం గురించీ, దాని విశిష్టతను గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఆ పుణ్యక్షేత్రాలను దర్శించి వచ్చినందు వలన పరిపూర్ణమైన ఫలితం కలుగుతుంది.