గజేంద్రమోక్షానికి ముందు ఏం జరిగింది ?
భక్తుల మొరను శ్రీమహావిష్ణువు ఎంతగా ఆలకిస్తాడో...రక్షించడానికి ఎంత వేగంగా వస్తాడో అనే విషయాన్ని 'గజేంద్ర మోక్షం' సంఘటన తెలియజేస్తూ వుంటుంది. ఆర్తులను కాపాడటానికి స్వామి ఎంతగా ఆరాటపడతాడోననే విషయాన్ని చాటిచెప్పే ఈ సంఘటన గురించి తెలియని వాళ్లు వుండరు. అలాంటి ఈ గజేంద్ర మోక్షం వెనుక ఓ ఆసక్తికరమైన కథ లేకపోలేదు. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు పూర్వజన్మలో 'ఇంద్రద్యుమ్నుడు'అనే రాజు కాగా, మొసలి రూపంలో వున్నది 'హూహూ'అనే గంధర్వడు.
పూర్వం విష్ణు భక్తుడైన ఇంద్రద్యుమ్నుడు మౌనదీక్షలో వున్న కారణంగా, అప్పుడే అక్కడికి వచ్చిన అగస్త్యమహర్షికి ఆయన ఆశించిన స్థాయిలో స్వాగతం పలకలేకపోతాడు. ఫలితంగా అగస్త్యమహర్షి శాపానికి గురై ఏనుగుగా జన్మిస్తాడు. శ్రీమహావిష్ణువుచే రక్షించబడినప్పుడు శాపవిమోచనం కలుగుతుందని అంటాడు అగస్త్యమహర్షి. ఏనుగుగా జన్మించినా ఇంద్రద్యుమ్నుడు శ్రీమహావిష్ణువు నామాన్ని స్మరించడం మాత్రం మానడు.
ఇక 'హూహూ' అనే గంధర్వుడు తన దేవేరులతో కలిసి 'మాలిని'నదిలో జలకాలాడుతూ ఉంటాడు. అదే సమయంలో స్నానానికి ఆ నదిలోకి దిగుతాడు దేవలమహర్షి. తన దేవేరులను నవ్వించడం కోసం ఆయన ఆ మహర్షి కాలు పట్టుకుని లోపలికి లాగుతాడు. ముసలిలా వచ్చి తన కాలు పట్టుకుని లాగి అవమాన పరిచినందుకు గాను మొసలిగా జన్మించమని ఆ మహర్షి శపిస్తాడు. శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంచే శిరస్సు తెగిపడినప్పుడు శాపవిమోచనం కలుగుతుందని చెబుతాడు. అలా ఏనుగులా జన్మించిన ఇంద్రద్యుమ్నుడుకి ... మొసలిలా జన్మించిన గంధర్వుడికి శ్రీమహావిష్ణువు కారణంగా శాపవిమోచనం కలుగుతుంది.