ధనయోగాన్ని సూచించే పుట్టుమచ్చలు

ధనయోగాన్ని సూచించే పుట్టుమచ్చలు
పుట్టుమచ్చలు వ్యక్తి యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయనీ, వారి ఆయురారోగ్యాలను ... ఆర్థికపరమైన పరిస్థితులను తెలియజేస్తాయనే నమ్మకం ప్రాచీనకాలం నుంచి వుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు పుట్టుమచ్చలు వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తూ వస్తున్నాయనే విషయాన్ని చాలామంది విశ్వసిస్తూ వుంటారు. శరీరంపై ఆయా ప్రదేశాల్లో గల పుట్టుమచ్చలు ఆయా ఫలితాలను కలిగిస్తూ ఉంటాయని చెప్పబడుతోంది.

ఈ నేపథ్యంలో కొన్ని ప్రదేశాల్లో గల పుట్టుమచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయని శాస్త్రం స్పష్టం చేస్తోంది. తలపై కుడి భాగంలోనూ .. నుదురు మధ్య భాగంలో .. కుడి కణతపై .. ఎడమ కణతపై .. కుడి కన్ను రెప్పపై .. కుడి కన్ను లోపలి భాగంలో గల పుట్టుమచ్చల వలన ధనయోగం కలుగుతుంది. ముక్కు కుడి భాగంలోనూ .. కుడి చెంపపై .. చెవులపై .. నాలుక చివరి భాగంలోనూ గల పుట్టుమచ్చలు ఊహించని విధంగా ధనవంతులను చేస్తాయి.

ఇక మెడ ముందు భాగంలో ఏవైపున వున్నా .. కుడి భుజం పైన .. పొట్ట పైన .. హృదయ స్థానంలోను .. మోచేతి పైన .. కుడి అరచేతిపై .. కుడి తొడపై ... కుడి మోకాలుపై గల పుట్టుమచ్చలు శ్రీమంతులను చేసేవిగా చెప్పబడుతున్నాయి. ఈ ప్రదేశాల్లో గల పుట్టుమచ్చల వలన కష్టపడటం వలన గానీ, కాలం కలిసిరావడం వలన గాని ధనయోగం కలుగుతుందనేది స్పష్టమవుతోంది.

More Bhakti Articles