ఇవి కలలో కనిపించకూడదా ?
జీవితమంటే 'కల'కాదని అంటూ వుంటారు. అంటే కల అనేది వాస్తవం కన్నా ఎంతో అందంగా ఉంటుందనేది వాళ్ల అభిప్రాయం. అయితే అందంగా సాగిపోతూ అనుభూతిని కలిగించే కలలే కాదు, కంగారు పుట్టించే కలలు కూడా వస్తూ ఉంటాయనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక అందమైన కలలు వచ్చినప్పుడు అప్పుడే తెల్లవారిందా? అనిపిస్తుంది. పీడ కలలు వచ్చినప్పుడు ఎప్పుడు తెల్లవారుతుందిరా దేవుడా! అనిపిస్తుంది.
సాధారణంగా మనం చూసిన సంఘటనలు ... వినడం ద్వారా మనలను ప్రభావితం చేసిన సంఘటనలు ... ఇలా జరుగుతుందేమోననే ఆందోళనతో కూడిన ఆలోచనలు దృశ్య రూపాన్ని సంతరించుకుని కలగా వస్తూ వుంటాయి. ఇలాంటి కలలను గురించి అంతగా పట్టించుకోనవసరం లేదు. కానీ ఎలాంటి సంబంధం లేకుండా వచ్చే కొన్ని కలలు మాత్రం భవిష్యత్తులో జరగనున్న కొన్ని పరిణామాలను సూచిస్తూ వుంటాయి.
చీకట్లో ఒంటరిగా నడచుకుంటూ వెళ్లి ఏ గోతిలోనో ... నీటిలోనో పడినట్టుగా, అలాగే పడవలో ప్రయాణిస్తూ హఠాత్తుగా నదిలో పడిపోయి కొట్టుకుపోతున్నట్టుగా కల రావడం జరుగుతూ వుంటుంది. ఈ విధమైన కలలు భవిష్యత్తులో జరగనున్న ప్రమాదాలను సూచిస్తూ వుంటాయి. ఇక గాడిదలు ... కుక్కలు ... నక్కలు ... ఒంటెలు వంటి జంతువులు, కాకులు .. గుడ్లగూబలు ... గబ్బిలాలు త్వరలో జరగనున్న కీడును తెలియజేస్తూ వుంటాయి.
నూనె .. కల్లు వంటివి తాగినట్టుగా, వాటితో స్నానం చేసినట్టుగా వచ్చే కలలు అనారోగ్యానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఆర్ధికంగా ... ఆరోగ్యపరంగా ఆశుభాలను సూచించే ఈ కలలు కలవరపెడుతుంటాయి ... కంగారు పెట్టేస్తుంటాయి. అలాంటప్పుడు ఇష్టదేవత ఆరాధన చేయడం వలన మనసు కుదుటపడుతుంది ... చెడు కల వలన వచ్చే ఫలితం ప్రభావం తగ్గుతుంది.