మారేడు చెట్టు విశిష్టత ఎలాంటిది ?
మారేడు చెట్టు ... మామిడి చెట్టులా కళకళలాడుతూ కాకుండా అనేక ముళ్లతో కనిపిస్తుంది. మారేడు కాయాలు మామిడికాయల్లా నోరు ఊరించలేవు. ఇక మారేడు దళాలను తమలపాకుల్లా శుభకార్యాలలోను ఉపయోగించరు. అలాంటి మారేడు చెట్టు ఎలా విశిష్టమైనది అవుతుందనే సందేహం కొంతమందిలో కలుగుతూ వుంటుంది.
మారేడుచెట్టు శివస్వరూపమైనదిగా చెప్పబడుతోంది. మారేడు దళాలు బ్రహ్మ .. విష్ణు .. మహేశ్వరులకు ప్రతీకలుగా చెప్పబడుతున్నాయి. అంతే కాకుండా మూడుఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి మూడు నేత్రలుగా విశ్వసిస్తూ వుంటారు. తులసీ దళాలు లేకుండా శ్రీమహావిష్ణువుకి చేసే పూజ వ్యర్థమైనట్టే, మారేడు దళాలు లేకుండా సదాశివుడికి జరిపే పూజ కూడా వ్యర్థమని చెప్పబడుతోంది.
కాలకూట విషాన్ని మింగడం వలన పరమశివుడు తీవ్రమైన వేడికి లోనవుతుంటాడు. మారేడు దళాలు ఎంతో చల్లదనాన్ని కలిగిస్తూ వుంటాయి గనుక, వీటితో శివుడిని అర్చిస్తుంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగి ఉంటాయని చెప్పబడుతోంది. మారేడుచెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయడం వలన గంగానది స్నాన ఫలితం దక్కుతుందని అంటారు.
పుణ్య ఫలాలను ఆర్జించడం కోసం కొందరు పెద్ద సంఖ్యలో అన్నదానాలు చేయాలని అనుకుంటారు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా చేయలేకపోతుంటారు. అన్నదానం వలన పొందవలసిన పుణ్య ఫలాలను పొందలేక పోతున్నందుకు బాధపడుతుంటారు. అలాంటి వారు మారేడుచెట్టు నీడలో అన్నదానం చేయవచ్చు. మారేడు చెట్టునీడలో కొందరికి అన్నదానం చేసినా కోటిరెట్ల ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది. ఇక మారేడు చెట్టు మూలంలో శివలింగాన్ని వుంచి పూజించడం వలన సకల శుభాలు చేకూరతాయి. శివ సాయుధ్యం సైతం లభిస్తుంది.