గోవుతో గృహప్రవేశం
జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవడంకన్నా పెద్ద కోరిక ఇంకొకటి ఉండదని అంటుంటారు. సొంత ఇల్లు కల నిజం చేసుకోవడం కోసం ఎన్నో కష్టాలను ఆనందంగా అనుభవిస్తూ వుంటారు. ఊరు ఏదైనా అక్కడ తమకంటూ ఓ సొంత ఇల్లు ఉన్నప్పుడే ఆ ఊరు తమదని చెప్పుకునే ధైర్యం కలుగుతుంది. లేదంటే ఆ ఊరుకి తాము పరాయి వారిమనే భావనే కలుగుతూ బాధిస్తూ వుంటుంది. అందుకే అందరూ సొంత ఇంటికి అంతటి ప్రాధాన్యతను ఇస్తుంటారు.
ఇక ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరూ తమ బంధు మిత్రులను ఆహ్వానించి 'గృహప్రవేశం' చేస్తుంటారు. గృహ ప్రవేశానికి ముందు ఆ కొత్త ఇంట్లో గోమాతను తిప్పడం మన ఆచారంగా వస్తోంది. గోవు సకలదేవతా స్వరూపంగా చెప్పబడింది. గోవుతో పాటే సమస్త దేవతలు వస్తారని శాస్త్రం చెబుతోంది. అందువలన నూతన గృహాల్లోకి గోవును ప్రవేశ పెట్టడాన్ని శుభసూచకంగా విశ్వసిస్తుంటారు. నూతన గృహంలో గోవు మూత్రం ... పేడ వేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తుంటారు.
అయితే పట్టణాల్లో అపార్ట్ మెంట్ల సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. అందువలన బహుళ అంతస్తులు కలిగిన ఈ భవనాల్లోకి ఆవును తీసుకు రావడం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే విషయంగా చాలా మందికి సందేహం కలుగుతుంటుంది. లక్షలు ఖర్చుపెట్టినా ఆవు అడుగు పెట్టకుండా అయిందేననే అసంతృప్తి కలుగుతుంటుంది. అయితే శాస్త్రం ఇందుకు చాలా స్పష్టమైన సమాధానం చెబుతోంది.
బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేసే వాళ్లు ... ఆ భవనం ప్రాంగణంలో ఆవు దూడలను అలంకరించి పూజించాలి. ఆవుదూడలకు అవసరమైన ఆహారాన్ని సమర్పించడమే కాకుండా, వాటి యజమానులను దక్షిణ తాంబూలాలతో సంతృప్తి పరచాలి. గోవు పేడను ... మూత్రాన్ని తమ నివాస స్థలంలో చిలకరించవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆవును నేరుగా ఇంట్లో తిప్పిన ఫలితం లభిస్తుంది.