ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేశ్ ఇంట్లో తీవ్ర విషాదం... ప‌వ‌న్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌!

   
టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేశ్ ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న సోద‌రి మాదాసు స‌త్య‌వ‌తి ఈరోజు హైద‌రాబాద్‌లో క‌న్నుమూశారు. స‌త్య‌వ‌తి మ‌ర‌ణం ప‌ట్ల ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. 

వారి కుటుంబం విజ‌య‌వాడ‌లోని మాచ‌వ‌రం ప్రాంతంలో నివ‌సించేద‌ని, చ‌దువుకునే రోజుల్లో వేస‌వి సెల‌వుల‌కు వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్ల‌మ‌ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. స‌త్య‌వ‌తి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 


More Telugu News