Mamata Banerjee: పోలీసులతో వచ్చి మమతా బెనర్జీ కీలక డాక్యుమెంట్లు తీసుకువెళ్లారు: ఈడీ సంచలన ఆరోపణలు

Mamata Banerjee Removed Key Documents Says ED
  • ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు
  • సోదాల సమయంలో ప్రతీక్ జైన్ నివాసానికి వచ్చిన మమతా బెనర్జీ
  • మమతా పోలీసు అధికారులతో వచ్చి కీలక డాక్యుమెంట్లు తీసుకెళ్లారని ఈడీ ఆరోపణ
కోల్‌కతాలోని ఐ-ప్యాక్ సంస్థపై దాడుల వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఐ-ప్యాక్ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో దాడులు జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ ఆ ఇంట్లోకి ప్రవేశించి, ఎలక్ట్రానిక్ పరికరాలు, పలు దస్త్రాలు సహా కీలక ఆధారాలను తీసుకువెళ్లారని పేర్కొంది. ముఖ్యమంత్రి, ఆమె సహాయకులు, పోలీసులు వాటిని బలవంతంగా తీసుకెళ్లారని అన్నారు.

బొగ్గు అక్రమ రవాణా ద్వారా ఆదాయం పొందిన వ్యక్తులకు సంబంధించి కోల్‌కతాలో ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది. హవాలా మనీతో ఐ-ప్యాక్‌కు సంబంధం ఉందని, ఇందులో ఒక వ్యక్తికి, ఈ సంస్థకు మధ్య కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని తెలిపింది.

పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐ-ప్యాక్ డైరెక్టర్ నివాసానికి వచ్చారని తెలిపారు. అప్పటి వరకు సోదాలు శాంతియుతంగా జరిగాయని ఈడీ వెల్లడించింది. సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఏ రాజకీయ పార్టీని, ఏ ఎన్నికను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు చేపట్టలేదని స్పష్టం చేసింది.
Mamata Banerjee
I-PAC
Enforcement Directorate
ED Raids
Coal Scam
Prateek Jain
West Bengal

More Telugu News